Viral News: భర్త నోటిదూల.. శోభనం రోజే విడాకులు
Viral News: నోటి దూలకి కేరాఫ్ అడ్రెస్ ఎవరంటే పై ఫోటో కనిపిస్తున్న కొత్త పెళ్లికొడుకనే చెప్పాలి. చక్కగా పెళ్లైంది. తొలి రాత్రి రోజున సరదాగా కబుర్లు చెప్పుకోకుండా… భార్య తన భర్తను పరీక్షించాలని అనుకుంది. ఈ నేపథ్యంలో తనకు తాగుడు అలవాటు ఉందని.. గతంలో చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండేవారని.. రాత్రిళ్లు క్లబ్‌లకు వెళ్లేదానినని చెప్పింది. ఆమెకు ఈ అలవాట్లు లేవు. కానీ ఇలా చెప్తే తన భర్త కూడా నిజాలు చెప్తాడేమో అని ఓ రాయేసి చూసింది. అతను పెద్ద సత్యహరిశ్చంద్రుడిలాగా తనకు కూడా ఇలాంటి చాలా అలవాట్లు ఉన్నాయని చెప్పేసాడు. దాంతో అసలు నిజ స్వరూపం ఇదా అని షాకైన ఆ అమ్మాయి చెంప ఛెళ్లుమనిపించింది. తనకు విడాకులు కావాలంటూ అరిచి గోల చేసింది.
దాంతో ఆ అబ్బాయి షాక్‌కు గురయ్యాడు. ఆ అమ్మాయి గది నుంచి బయటికి వెళ్లిపోయి తన అత్తామామలకు, తల్లిదండ్రులకు మ్యాటర్ చెప్పింది. విడాకులు కావాలంటూ అప్పటికప్పుడే పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. ఇదంతా బయటికి ఎలా వచ్చిందంటే.. ఆ అమ్మాయి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. ఆ అమ్మాయి ఇదేదో పెళ్లికి ముందే చేసి ఉంటే ఇంత రచ్చ అయ్యి ఉండేది కాదు కదా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.