అమానుషం.. భార్య యోనికి తాళం..!

husband locks wife's private parts

Viral News: పుణెలో అమానుష ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్య మ‌రొక‌రితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌న్న అనుమానంతో ఆమె ప్రైవేట్ భాగాల‌ను గాయ‌ప‌రిచి వాటికి తాళం వేసాడు. వివ‌రాల్లోకెళితే.. నేపాల్‌కు చెందిన ఉపేంద్ర అత‌ని భార్య మూడేళ్ల క్రితం పుణెలోని పింప్రి ప్రాంతంలో స్థిర‌ప‌డ్డారు. కొంత‌కాలంగా ఉపేంద్ర అత‌ని భార్య‌పై అనుమానంతో ఉన్నాడు. ఆమెకు మ‌రొక‌రితో అక్ర‌మ సంబంధం ఉందంటూ రోజూ కొడుతూ ఉండేవాడు. ఈనేప‌థ్యంలో నిన్న రాత్రి పీక‌ల‌దాకా తాగిన ఉపేంద్ర ఇంటికి వెళ్లి భార్య‌ను చిత‌క‌బాదాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆమె యోనికి రెండు వైపుల రంధ్రాలు పెట్టి గొళ్లెం బిగించి తాళం వేసాడు.

ఆ తాళాన్ని దూరంగా విసిరేసాడు. తీవ్ర ర‌క్త‌స్రావం కావడంతో ఆ మ‌హిళ అల్లాడిపోయింది. ఆమె అరుపులు విని ప‌క్కింటి వ్య‌క్తి వెంట‌నే ఇత‌రుల సాయంతో ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాడు. రెండు గంట‌ల పాటు స‌ర్జ‌రీ చేసి వైద్యులు ఆమెకు బిగించిన ఇనుప రాడ్లు తాళాన్ని తీసారు. ఆ త‌ర్వాత వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ఉపేంద్ర‌ను అదుపులోకి తీసుకున్నారు.