Loan తీర్చలేకపోయిన భర్త.. రేప్‌కు గురైన భార్య
Pune: ఓ వ్యక్తి తీసుకున్న అప్పు (loan) తీర్చలేదని అతని భార్యను రేప్ చేసాడు ఓ కసాయి వ్యక్తి. ఈ దారుణ ఘటన పుణెలో (pune) చోటుచేసుకుంది. పుణెకు చెందిన ఓ వ్యక్తి అవసరం కోసం ఓ 47 ఏళ్ల వడ్డీ వ్యాపారి నుంచి అప్పు (loan) తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా అసలు, వడ్డీ ఇవ్వడంలేదు. దాంతో ఆ వడ్డీ వ్యాపారి ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి బెదిరించాడు. డబ్బు లేదు అని చెప్పడంతో కత్తితో బెదిరించి అతని భార్యను రేప్ చేసాడు. అంతటితో ఆగకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.