పెళ్లైన కొన్ని గంటల్లోనే భర్తకు న్యూడ్ వీడియో పంపిన మాజీ ప్రియుడు
Viral News: పెళ్లైన కొన్ని గంటల్లోనే మాజీ ప్రియుడి నుంచి భర్తకు న్యూడ్ వీడియోలు అందాయి. దాంతో అతనికి ఒళ్లు మండిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పకుండా అతనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేసాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఐష్బాగ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడితో రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడింది. కొన్ని కారణాల వల్ల అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు.
కానీ ఆ అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది. నిశ్చితార్ధం జరిగాక కూడా వీరిద్దరూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకునేవారు. ఓసారి ఆ అబ్బాయి స్ట్రిప్ డ్యాన్స్ (దుస్తులన్నీ విప్పి డ్యాన్స్) చేయాలని కోరాడు. ఆ అమ్మాయి ముందు వెనక ఆలోచించకుండా అతను చెప్పింది చెప్పినట్లు చేస్తూ వెళ్లింది. దాంతో అతను అన్నీ రికార్డ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి పెళ్లి జరిగిందో ఆ మరుసటి రోజే ఆ వీడియోలను భర్తకు పంపాడు. అతను ఆ వీడియోను తన సోదరుడు, తల్లికి చూపించడంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వారు సలహా ఇచ్చారు. అతను అలాగే చేయడంతో విషయం యువతికి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Rajamundry: కంట్లో కారం కొట్టి.. వధువును కిడ్నాప్ చేయబోయి..