భార్య‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు.. జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు..!

husband caught wife while having affair but court punishes him

Viral News: ఓ భ‌ర్త ప‌రాయి మ‌గాడితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న భార్య‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే.. భార్య‌కు బ‌దులు అత‌ను జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు. భార్య‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు.. జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు..! తైవాన్‌కు చెందిన ఫాన్ అనే వ్య‌క్తికి తన భార్య‌పై ఎప్ప‌టి నుంచో అనుమానంగా ఉంది. తాను ఆఫీస్‌కి వెళ్లగానే త‌న భార్య మ‌రో వ్య‌క్తిని ఇంటికి పిలిపించుకుని స‌ర‌సాలు ఆడుతోంద‌ని ప‌సిగ‌ట్టాడు. ఆమెను ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకోవాల‌ని ఇంట్లోని అన్ని గ‌దుల్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.

అలా ఓ రోజు ఫాన్ భార్య అడ్డంగా దొరికిపోయింది.  ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఫాన్ విడాకులకు ద‌ర‌ఖాస్తు చేసాడు. అయితే విడాకులు ఇవ్వడానికి ఫాన్ భార్య ఒప్పుకోలేదు. దాంతో ఇద్ద‌రూ కోర్టులో తేల్చుకోవాల‌ని అనుకున్నారు. తీరా చూస్తే కోర్టులో ఫాన్‌కు చుక్కెదురైంది. త‌న భార్య త‌నను మోసం చేసింది విడాకులు మంజూరు చేయండి అని కోరితే.. ఫాన్ భార్య మాత్రం త‌న బెడ్‌రూంలో సీసీ కెమెరాలు పెట్టించి త‌న ప్రైవ‌సీకి భంగం క‌లిగించాడ‌ని.. ఇది న్యాయం కాద‌ని తెలిపింది. దాంతో కోర్టు ఫాన్‌దే త‌ప్ప‌ని తీర్పు ఇస్తూ మూడు నెల‌ల జైలు శిక్ష విధించింది.