Khammam: పదేళ్ల ప్రేమ.. భర్తను మోసం చేస్తూ కానిస్టేబుల్‌తో ఎఫైర్
Khammam: రోజు రోజుకు పోలీస్ శాఖలో ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కోర్టు విషయంలో వచ్చిన ఓ వివాహితను చెల్లి, బుజ్జి అంటూ దగ్గరైన కానిస్టేబుల్ ఏకంగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాంతో వివాహిత భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్ టీంలో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు, కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ లోంగదిసుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా తన భార్యతో, కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇంతకు ముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్లో దొరికాయి. ఆ సమయంలో భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు. 10 ఏళ్ల ప్రేమ, ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.