Ghaziabad: చాయ్ తేవడం ఆలస్యమైందని తల నరికేసాడు
Ghaziabad: ఉదయం వేళ టీ పెట్టి ఇవ్వడం కాస్త ఆలస్యం అయినందుకు ఓ వ్యక్తి పెద్ద కత్తితో భార్య తల నరికేసాడు. దాంతో ఆమె తల ఒక్కసారిగా తెగి పడింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం టీ విషయంలో ధరమ్‌వీర్ (52), సుందరి (50)ల మధ్య గొడవ జరిగింది. ఒక పది నిమిషాల్లో టీ పెట్టి ఇస్తాను అన్నందుకు ధరమ్‌వీర్ సుందరితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరగడంతో తన దగ్గరున్న తల్వార్‌తో తలనరికేసాడు. పోలీసులు ధరమ్‌వీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.