Aliens: భవిష్యత్తులో రోబోలు, ఏలియన్లతోనే సెక్స్..!
Aliens: ఇప్పుడంటే మనుషులు మనుషులతో సెక్స్ చేస్తున్నారు కానీ.. భవిష్యత్తులో మనుషులు రోబోలు, గ్రహాంతరవాసులతో చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న కాలంలో ఒక్కొక్కరు మల్టిపుల్ పార్ట్నర్స్తో శృంగార కార్యక్రమాలను కానిచ్చేస్తున్నారు. అదేంటి అని ప్రశ్నిస్తే ఈరోజుల్లో ఇది కామన్ అని తేలిగ్గా చెప్పేస్తున్నారు. మరో 50 ఏళ్లలో ఈ మల్లిపుల్ పార్ట్నర్స్తో సెక్స్ అనేది మరింత లీగల్ అయిపోతుందని అమెరికాకు చెందిన సెక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాదు.. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే టాపిక్ కూడా సర్వసాధారణం అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది.
అంతేకాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించే రోబోలతో సెక్స్ చేయడం కూడా కామన్ అయిపోతుంది. శృంగార ఫాంటసీల విషయంలో మనుషులు గ్రహాంతరవాసులతో సెక్స్ చేస్తున్నట్లు కూడా ఊహించుకునే రోజులు వస్తాయట. 50 ఏళ్లలో రోబోలు మనుషుల్లాగే మన మధ్య తిరుగుతుంటాయి. వాటితో ఓ మనిషిలాగే మనం ప్రవర్తిస్తుంటామట. ఈ తరుణంలోనే మనుషుల పట్ల కలగాల్సిన ప్రేమను రోబోలపై పెంచుకుని వారితోనే వాంఛలను తీర్చుకునే రోజులు ఆసన్నమవుతాయని నిపుణులు వెల్లడించారు.