షాకింగ్.. ఐస్‌క్రీంలో మ‌నిషి వేలు..!

human finger found in ice cream

Ice Cream: ఆహార ప‌దార్థాల్లో చ‌చ్చిన దోమ‌లు, పురుగులు రావ‌డం చూస్తూనే ఉంటాం. కానీ ముంబైలో మాత్రం షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐస్‌క్రీం తింటుండ‌గా ఏకంగా మ‌నిషి వేలు ప్రత్య‌క్ష‌మైంది. దాంతో అది తింటున్న వ్యక్తికి గుండె ఆగినంతప‌నైంది. ముంబైలోని మలాద్ ప్రాంతంలో నిన్న ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిన ఓ మహిళకు తెగిపోయిన మనిషి వేలు క‌నిపించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసారు. ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.