How To Change Aadhaar Photo: ఫోటో మార్చడం ఇక సింపుల్
How To Change Aadhaar Photo: ఆధార్ కార్డులో మన ఫోటో చూడగానే చిరాకు వచ్చేస్తుంది. ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం. మీరు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఫోటో బాలేకపోతే ఇప్పుడు సింపుల్ ప్రక్రియ ద్వారా మార్చేసుకోవచ్చు. UIDAI వెబ్సైట్ ద్వారా మీ ఫోటోను మార్చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే..
ముందు UIDAI వెబ్సైట్లో లాగిన్ అవ్వండి
మై ఆధార్ అనే ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఆధార్ కార్డు అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేయండి
మీ వివరాలన్నీ కరెక్ట్‌గా ఆ ఫాంలో నింపండి
ఆ ఫాంను తీసుకుని మీ దగ్గర్లోని ఆధార్ కార్డు సెంటర్‌కు వెళ్లండి
మీరు సెంటర్‌కు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు ఐడీని కూడా తీసుకెళ్లండి.
ఆధార్ కార్డు సెంటర్లో ఉన్న సభ్యులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేస్తారు
అవన్నీ కరెక్ట్ అని తెలిసాక మీ నుంచి కొత్త ఫోటో తీసుకుంటారు.
రూ.100తో పాటు GST రుసుం కూడా మీ నుంచి తీసుకునే అవకాశం ఉంది.
మీ ఫోటో అప్డేట్ అయ్యాక మీకు యునీక్ రిక్వెస్ట్ నెంబర్ (URN) ఇస్తారు. ఈ నెంబర్ ద్వారా మీ ఫోటో మారిందో లేదో చెక్ చేసుకోవచ్చు.