సూర్య కిర‌ణాలు ఆపి.. భూమిని శాస్త్రవేత్త‌లు ఎలా చ‌ల్ల‌బ‌రుస్తున్నారు?

Earth: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త‌లు ర‌హ‌స్యంగా ఒక టాస్క్ చేప‌డుతున్నారు. అదేంటంటే.. సూర్య కిర‌ణాలు భూమిని తాక‌కుండా చేసి.. నేల‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్నారు. భార‌త్‌లోనే కాదు అమెరికాలోనూ ఎండ‌లు దంచుతుంటాయి. 2023 అమెరికాలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు క‌లిగిన సంవ‌త్స‌రం అట‌. దాంతో అమెరికా నేల‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు క్లౌడ్ బ్రైటెనింగ్ అనే టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఈ టెక్నిక్ ద్వారా మేఘాలు మ‌రింత కాంతివంతంగా మారి సూర్య కిర‌ణాలు భూమిపై త‌క్కువ‌గా ప‌డేలా చేస్తాయి. ఫ‌లితంగా భూమి చ‌ల్ల‌బ‌డుతుంది. ఈ టెక్నిక్ గ‌న‌క వ‌ర్క‌వుట్ అయితే మ‌హాస‌ముద్రాల మీదుగా ఈ ప‌రిక‌రాలు వాడి స‌ముద్ర ఉష్ణోగ్ర‌త‌ను త‌గ్గించ‌గ‌లుగుతారు. ఏప్రిల్ 2న వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు సాన్ ఫ్రాన్సిస్కో మీదుగా డీకమిషన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్ ద్వారా ఉప్పు ప‌దార్థాల‌ను ఆకాశంలోకి చ‌ల్లారు. ఈ ప్రాజెక్ట్‌కి కోస్ట‌ల్ అట్మోస్ఫియ‌రిక్ ఎరోసోల్ రీసెర్చ్ అండ్ ఎంగేజ్‌మెంట్ (CAARE)అని నామ‌క‌ర‌ణం చేసారు.

దీని ద్వారా ఏం జ‌రుగుతుందంటే.. ఆ ఉప్పు నీటి బిందువుల వ‌ల్ల సూర్య కిర‌ణాలు భూమిపై ఎక్కువగా ప‌డ‌వు. మ‌రి ఈ టెక్నిక్ వ‌ల్ల గ్లోబ‌ల్ వార్మింగ్ స‌మ‌స్య త‌గ్గుతుందా అంటే ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అంటున్నారు శాస్త్రవేత్త‌లు.  ఇంత‌టి స్థాయిలో టెక్నాల‌జీని వాడుతున్నాం కాబ‌ట్టి రానున్న రోజుల్లో వాతావ‌ర‌ణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌హాస‌ముద్రాల్లో ఉష్ణోగ్ర‌త‌ల మార్పు వ‌ల్ల మెరైన్ బ‌యాల‌జీపై ప్ర‌భావం చూపుతుంది. వర్షాలు ప‌డే విధానంలో కూడా మార్పులు వ‌స్తాయి. ఒక చోట ఎక్కువ ప‌డుతూ మ‌రో చోట త‌క్కువ ప‌డ‌టం వంటి మార్పులు వ‌స్తాయ‌ని అంటున్నారు. చూద్దాం.. శాస్త్రవేత్త‌లు ఎలాంటి బ్ర‌హ్మాండాల‌ను సృష్టిస్తారో..!