Neeraj Chopra: హర్యానా ఐకాన్..!
బల్లెం వీరుడు నీరజ్ చోప్రా (neeraj chopra) మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌లో (world athlete championship) పాకిస్థానీ అథ్లెట్‌తో తలపడి స్వర్ణం సాధించాడు. స్వర్ణ పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు నెలకొల్పాడు. హర్యానాకు (haryana) చెందిన ఈ బల్లెం వీరుడు గోల్డెన్ బాయ్‌గా ఎలా మారాడో తెలుసుకుందాం. 25 ఏళ్ల వయసులోనే భారతదేశ స్పోర్ట్స్ ఐకాన్స్‌లో ఒకరిగా నిలిచాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత 23 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయుడు మన నీరజ్.(neeraj chopra)
ఇప్పుడున్న ఫిట్‌నెస్‌ను నీరజ్ అలాగే మెయింటైన్ చేస్తే గనక మరిన్ని విజయాలు అందుకునే అవకాశం ఉంది. నీరజ్‌కు 30 ఏళ్ల వచ్చే సరికి రెండు ఒలింపిక్స్, రెండు వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఆడచ్చు. 2021 టోక్యో ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతాకం సాధించిన నీరజ్‌కు భారతదేశం నీరాజనాలు పలికింది. వందల్లో సన్మాన కార్యక్రమాలు జరిగాయి. దాంతో ట్రైనింగ్‌కి సమయం లేకుండాపోయింది. ఈ క్రమంలో కాస్త వెయిట్ కూడా పెరిగాడు.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత గూగుల్‌లో అత్యధికంగా వెతికింది నీరజ్ గురించే. టోక్యో గోల్డ్ సాధించాక నీరజ్ బ్రాండ్ వ్యాల్యూ దూసుకెళ్లింది. ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్ తనని అంబాసిడర్‌గా తీసుకున్నాయి. (neeraj chopra)
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అదిల్ సమారీవాలా.. నీరజ్ టోక్యో ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ పతకం సాధించాక ఇండియాలో క్రికెట్ కాకుండా ఇంకా ఎన్నో క్రీడల్లో సత్తా చాటొచ్చని తెలిసిందని తెలిపారు. ఆగస్ట్ 7.. అంటే నీరజ్ టోక్యో ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన రోజుని జాతీయ జావెలిన్ దినోత్సవంగా ప్రకటించారు. ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న నీరజ్ సక్సెస్ సీక్రెట్ స్థిరత్వమే. ఈరోజు ప్రాక్టీస్ చేసి రెండు రోజులు రెస్ట్ తీసుకునే టైప్ కాదు నీరజ్. గత రెండేళ్లలో ఎన్నో ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న నీరజ్.. తను వేసే ఈట దూరం పెరుగుతూనే వచ్చిందే తప్ప తగ్గలేదు.
నీరజ్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు చాలా లావుగా అల్లరిపిల్లాడిలా ఉండేవాడు. అతని తండ్రి సతీష్ కుమార్ చోప్రా ఎలాగైనా నీరజ్ అల్లరి తగ్గించి కంట్రోల్‌లో పెట్టాలనుకున్నాడు. ముందు నీరజ్‌ను బరువు తగ్గాలని తన తండ్రి ఎంతో బుజ్జగించడంతో మొత్తానికి ఒప్పుకున్నాడు. అలా నీరజ్‌ను తన అంకుల్ పానిపట్‌లోని శివాజీ స్టేడియంకు తీసుకెళ్లి రన్నింగ్ చేయించేవాడు. కానీ నీరజ్‌కు రన్నింగ్ అంటే అస్సలు ఇష్టంలేదు. రాళ్లు, కర్రలను దూరంగా విసురుతూ ఉండేవాడు. తనకు ఆ విసరడంలో ఏదో తెలీని ఆనందం ఉంది. దాంతో జావెలిన్ థ్రోని నేర్చుకుని అందులోనే కెరీర్‌ను సెట్ చేసుకోవాలనుకున్నాడు. అక్కడి నుంచి హర్యానా ఐకాన్‌గా నీరజ్ ఎలా మారాడో మనకు తెలిసిందే. (neeraj chopra)