అపోలో ల్యాండింగ్‌కి 55 ఏళ్లు.. చంద్రుడిపై గాలి లేన‌ప్పుడు జెండాను ఎలా ఎగిరేలా చేసారు?

How NASA Made a Flag Fly on the Moon Without Air

Apollo Moon Landing: 1969 జులై 20న అమెరికాకు చెందిన ప్ర‌ముఖ వ్యోమ‌గామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుపెట్టాడు.  ఆర్మ్‌స్ట్రాంగ్ త‌ర్వాత ఆయ‌న‌తో పాటు ఉన్న బ‌జ్ ఆల్డ్రిన్ అనే మ‌రో వ్యోమ‌గామి కూడా చంద్రుడిపై కాలుమోపాడు. చంద్రుడిపై న‌డిచిన తొలి మ‌నుషులు వీరిద్ద‌రే. ఈ నేప‌థ్యంలో NASA చంద్రుడిపై అమెరికా జాతీయ జెండాను పాతాల‌ని అనుకుంది. అయితే చంద్రుడిపై చాలా త‌క్కువ గురుత్వాక‌ర్ష‌ణ ఉంటుంది.

దాంతో నాసాకు చెందిన జాక్ కింజ్ల‌ర్ అనే వ్యోమ‌గామి త‌న టీంతో క‌లిసి చంద్రుడిపై పాతేందుకు అమెరిక‌న్ జాతీయ జెండాను త‌న‌దైన శైలిలో రూపొందించాడు. జెండాతో పాటు జెండాను పాతేందుకు క‌ర్రను కూడా ప్ర‌త్యేకంగా డిజైన్ చేసారు.  జెండా క‌ర్రపై ఆనోడైజ్డ్ అల్యుమినియం వాడారు. జెండాను ఎక్కువ కాలం మ‌న్నిక‌గా ఉండే నైలాన్ వ‌స్త్రంతో డిజైన్ చేసారు.

చంద్రుడిపై త‌క్కువ గురుత్వాక‌ర్ష‌ణ ఉంటుంది కాబ‌ట్టి జెండా క‌ర్ర‌కు చిన్న స్ప్రింగ్ లాంటిది అమ‌ర్చారు. అయితే చంద్రుడిపై పాతిన అపోలో జెండాను చూస్తే ఆ జెండా ఎగురుతున్న‌ప్పుడు ఫోటో తీసిన‌ట్లు ఉంటుంది. నిజానికి చంద్రుడిపై గాలి ఉండ‌దు. అందుకే ఆ జెండాను ఎగురుతున్న‌ట్లు క‌నిపించేలా డిజైన్ చేసారు. అమెరికా చంద్రుడిపై చేసే ప్ర‌తి ప్ర‌యోగాల‌కు ఇలాంటి జెండా డిజైన్‌నే రూపొందిస్తున్నారు.

మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు

ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 6 అపోలో మిష‌న్లు చేప‌ట్టిన నాసా.. చంద్రుడిపై ఆరు అమెరికా జెండాల‌ను పాతింది.

అన్ని జెండాలు ఇప్ప‌టికీ క‌నిపిస్తూ ఉంటాయ‌ట‌. కాక‌పోతే ఎన్నో ఏళ్లు అయిపోవ‌డం.. అక్క‌డ సూర్య‌ర‌శ్మి స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల అవి తెల్ల‌గా మారిపోయాయ‌ట‌.

అయితే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాతిన జెండా వారు వెళ్లిపోతున్న స‌మ‌యంలో వారి స్పేస్‌క్రాఫ్ట్‌కి ఉన్న‌ ఎగ్సాస్ట్ త‌గిలి అది ప‌డిపోయింద‌ట‌.