Hindenburg: అదానీపై ఆరోపణలు.. హిండెన్‌బర్గ్‌కి ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
Hindenburg: అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్‌వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ అదానీ సంస్థపై చేసిన షాకింగ్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా షాక్‌కి గురిచేసాయి. గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ షేర్ల విషయంలో పలు అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ విషయం ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది అనుకుంటున్న నేపథ్యంలో హిండెన్‌బర్గ్ మరో బాంబు పేల్చింది. అదానీ కంపెనీ పాల్పడిన అక్రమాల్లో సెబీ చీఫ్ మాధబి పురి.. ఆమె భర్త ధావల్ బచ్‌లకు కూడా వాటా ఉందని.. అందుకే తాము అదానీ షేర్లపై చేసిన ఆరోపణలను సెబీ పట్టించుకోలేదని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలు అదానీ గురించి కాదు. అయినప్పటికీ ఈరోజు అదానీ షేర్లు దారుణంగా పడిపోయాయి.
అదానీ సంస్థపై, షేర్లపై ఇలాంటి షాకింగ్ ఆరోపణలు చేయడంతో హిండెన్‌బర్గ్ సంస్థకి ఎంత లాభం వచ్చిందో తెలుసా? 4.1 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 34 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీల గుట్టు బయటపెట్టిన హిండెన్‌బర్గ్‌కి అదానీ కంపెనీ షేర్లకు సంబంధించిన ఆరోపణలు బయటపెట్టడంతోనే ఎక్కువ లాభాలు వచ్చాయని అంచనా.
అసలు హిండెన్‌బర్గ్ కంపెనీ చేసే పనేంటి?
హిండెన్‌బర్గ్ కంపెనీ షార్ట్ సెల్లింగ్ చేస్తుంటుంది. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే.. ఇప్పుడు సాధారణంగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారు షేర్ల ధరలు ఎక్కువ ఉన్న అమ్మేసి.. తక్కువగా ఉన్నప్పుడు కొనేస్తుంటారు. అదే షార్ట్ సెల్లింగ్‌లో అయితే.. పెట్టుబడిదారులు ఒక కంపెనీకి చెందిన షేర్లు తగ్గుతాయి అని బెట్టింగ్‌లకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న ధరలకు షేర్లు కొని అమ్మేస్తుంటారు. ఒకవేళ కొన్న ధరకంటే షేర్లు ఇంకా పడిపోతే.. వాటిని కొని లెండర్‌కు అవే షేర్లు అమ్మేస్తారు. అలా అమ్మగా కొనగా వచ్చిన లాభాన్ని వారు పొందుతుంటారు. ఒకవేళ షేర్ ధర తగ్గకుండా పెరిగితే మాత్రం పెట్టుబడిదారుడు తీవ్రంగా నష్టపోతుంటార.