Punishment For Rape: ఈ దేశాల్లో ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
Punishment For Rape: వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలో శిక్షణలో ఉన్న వైద్యురాలి పట్ల జరిగిన ఘోరం తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆ యువతికి న్యాయం జరగాలని యావత్ భారతదేశం కోరుకుంటోంది. అంటే కోపాలు వస్తాయి కానీ.. మన దేశంలో న్యాయవ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అసలు అత్యాచారం కేసుల్లో నిందితులకు ఏ దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసుకుందాం.
భారతదేశం – ఘోరమైన కేసుల్లో అయితే యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష. 2013లో కఠిన చట్టాలను తీసుకొచ్చారు.
ఫ్రాన్స్ – 15 ఏళ్ల వరకు కారాగార శిక్ష
చైనా – ఉరి శిక్ష. లేదా అంగాన్ని కోసేస్తారు. కానీ అక్కడ విచారణకు ఎక్కువ సమయం తీసుకోకపోవడం వల్ల అమాయకులు కూడా బలైపోతుంటారు.
సౌదీ అరేబియా – దోషి అని తేలిన వెంటనే పబ్లిక్‌గా తలనరికేస్తారు.
ఉత్తర కొరియా – నిలబెట్టి ఫైరింగ్ స్వ్కాడ్ చేత కాల్పులు జరిపిస్తారు
అఫ్గానిస్థాన్ – దోషి అని తేలిన నాలుగు రోజుల్లోనే పాయింట్ బ్లాంక్‌లో కాల్చేస్తారు. లేదంటే ఉరేస్తారు.
ఈజిప్ట్ – ఉరిశిక్ష
ఇరాన్ – ఉరిశిక్ష, పబ్లిక్‌లో వదిలేస్తే రాళ్లతో కొట్టించి చంపేస్తారు. కొన్నిసార్లు బాధితులు కూడా శిక్షకు గురవుతుంటారు.
ఇజ్రాయెల్ – 16 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష.
అమెరికా – అమెరికాలోని రాష్ట్రాల్లో శిక్షలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్నేళ్ల పాటు జైలు శిక్ష నుంచి యావజ్జీవం వరకు ఉంటాయి.
రష్యా – 3 నుంచి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష.
నార్వే – 4 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష