కూరగాయల వ్యాపారి కూతురు గ్యాంగ్‌స్టర్ వల్లో పడి చివరికి ఎలా చనిపోయింది?
Viral News: పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి పేరు దివ్యా పహూజా (divya pahuja). ఓ కూరగాయల వ్యాపారి కూతురు. ఏదో ఒక పనిచేస్తే కానీ పూట గడవని బతుకులు. అలాంటి అమ్మాయి ప్రపంచంలో అసలు అబ్బాయిలే లేనట్లు ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ప్రేమలో పడింది. చివరికి దుర్మరణం చెందింది. అసలు ఈ అమ్మాయి కథేంటో తెలుసుకుందాం.
దివ్య పహూజా స్వస్థలం హర్యాణాలోని గురుగ్రామ్. తండ్రి వికలాంగుడు. అయినా పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దివ్యకు అందం ఉండటంతో మోడలింగ్ చేయాలనుకుంది. అలా మోడలింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దివ్యకు 18 ఏళ్లు ఉన్నప్పుడే 2016లో అండర్ వరల్డ్ క్రిమినల్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. గురుగ్రామ్‌లోనే మోస్ట్ వాంటెడ్ అయిన సందీప్ గడోలీ అనే గ్యాంగ్‌స్టర్‌తో దివ్య ప్రేమలో ఉంది. 2016లో సందీప్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు లాగేందుకు పోలీసులు దివ్యను ఆమె కుటుంబీకులను అదుపులోకి తీసుకున్నారు.
వీరేందర్ కుమార్ అనే మరో గ్యాంగ్‌స్టర్ ఎలాగైనా సందీప్‌ను చంపేయాలనుకున్నాడు. ఇందుకోసం జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీరేందర్ దివ్యను ట్రాప్ చేసి సందీప్‌తో లవ్ ట్రాక్ నడిపించాడు. అలా 2017 ఫిబ్రవరిలో సందీప్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అయితే అది ఎన్‌కౌంటర్ కాదు. వీరేందర్ తన సోదరుడితో చంపించి ఎన్‌కౌంటర్ అని నమ్మించాడు. సందీప్ హత్య కేసులో భాగంగా దాదాపు ఏడు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించిన దివ్య ఇటీవల బెయిల్‌పై రిలీజ్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఐదుగురు వ్యక్తులు దివ్యకు మాయ మాటలు చెప్పి గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి దారుణంగా తుపాకీలతో కాల్చి హత్య చేసి పరారయ్యారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బీఎండబ్ల్యూ కారులో ఎక్కించి వేరే ప్రాంతానికి తరలించారు. అయితే ఇప్పటివరకు దివ్య మృతదేహం పోలీసులకు దొరకలేదు. ఇందుకోసం గురుగ్రామ్ మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దివ్య మృతికి.. జైల్లో ఉన్న వీరేందర్‌కు ఎలాంటి సంబంధంలేదని.. గురుగ్రామ్ హోటల్ ఓనర్ అయిన అభిజీత్ సింగ్ అనే వ్యక్తి ప్రైవేట్ ఫోటోలు దివ్య దగ్గర ఉండటంతో డబ్బు కోసం బ్ల్యాక్ మెయిల్ చేస్తోంది ఆ కారణంతోనే అభిజీత్ తన మనుషులతో హత్య చేయించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.