Viral News: 26 కోట్లు తెచ్చిపెట్టిన 5 డాలర్ల జ్యూస్..!
Viral News: అతనికి మధ్య తరగతి కుటుంబం. భార్య, పిల్లలతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నాడు. పిల్లల చదువుల కోసం ఆచి తూచి ఖర్చు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు అతను 5 డాలర్లు ఖర్చు పెట్టి ఒక జ్యూస్ బాటిల్ కొని ఇంటికి తీసుకెళ్లాడు. అది చూసి అతని భార్య ఇంత ఖరీదైన బాటిల్ ఇప్పుడెందుకు వాపసు ఇచ్చేయండి అని చెప్పి అతన్ని తిరిగి సూపర్ మార్కెట్‌కు పంపింది. ఆ సమయంలోనే అతనికి రూ.26,44,50,53,250 లాటరీ తగిలింది.
ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. తాయెబ్ అనే వ్యక్తి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు. పిల్లల చదువుల కోసం ఇంట్లోని సగ భాగాన్ని రెంట్‌కి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలా తాయెబ్ అతని భార్య కలిసి ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్నంతలో ఇంటిని నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరోజు తాయెబ్ సరుకులు తెచ్చుకోవడానికి స్థానిక సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ సరుకులతో పాటు పిల్లల కోసం 5 డాలర్ల జ్యూస్ బాటిల్ కొన్నాడు. అయితే ఆ జ్యూస్ బాటిల్ వద్దని వాపసు ఇచ్చేయాలని అతని భార్య మళ్లీ సూపర్ మార్కెట్‌కు పంపింది.
తాయెబ్ వెళ్లేసరికే సూపర్మార్కెట్లో పెద్ద లైన్ ఉంది. దాంతో అతను కూడా లైన్లో నిలబడ్డాడు. ఆ సమయంలో అతనికి సూపర్ మార్కెట్లో పెట్టిన ఓ లాటరీ బోర్డు కనిపించింది. ఓసారి ట్రై చేద్దాం అనుకుని ఆ జ్యూస్ బాటిల్ వాపసు ఇవ్వగా వచ్చిన 5 డాలర్లతో రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ మరుసటి రోజు వెళ్లి స్టోర్‌లో తనకు లాటరీ తగిలిందేమో అని చూసుకున్నాడు. మొదటి టికెట్‌కు లాటరీ రాలేదు కానీ రెండో టికెట్‌కు లాటరీ వచ్చిందన్న మెసేజ్ వచ్చింది. దాంతో వెంటనే లాటరీ స్టోర్‌కి వెళ్లి ఎంత వచ్చిందని అడగ్గా 315 మిలియన్ డాలర్ల లాటరీ తగిలిందని చెప్పారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 26,44,50,53,250 రూపాయలు. ఈ క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందని.. ఆమె జ్యూస్ వాపసు ఇచ్చిరమ్మని పంపకపోయి ఉంటే ఆ లాటరీ టికెట్ కొనేవాడిని కాదని తాయెబ్ తెగ సంతోషిస్తున్నాడు. ఇక నుంచి తాను రోజూ ఆ ఆరెంజ్ జ్యూస్ తాగుతానని అంటున్నాడు.