చేతిలో డబ్బు లేకున్నా రెంట్ కట్టొచ్చు!
చేతిలో డబ్బు లేకుండా అద్దెలు చెల్లించేయొచ్చు. ఎలాగో తెలుసా? రెంట్ నౌ పే లేటర్ సిస్టమ్ ద్వారా. అంటే బై నౌ పే లేటర్ లాంటిదే ఇది కూడా. బై నౌ పే లేటర్ అంటే.. ఇప్పుడు కొనుక్కుని తర్వాత డబ్బు చెల్లించే వెసులుబాటు ఉన్న సిస్టమ్. అదే రెంట్ నౌ పే లేటర్ అంటే.. మీకు అద్దె కట్టుకోవడానికి ముందుగా డబ్బు ఇచ్చి.. ఆ తర్వాత చెల్లించుకోవచ్చు అన్న ఆప్షన్‌ను ఇస్తారన్నమాట. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఈ రెంట్ నౌ పే లేటర్ ఆప్షన్‌ను అమలు చేసింది హౌసింగ్.కామ్. ఇందుకోసం బెంగళూరుకు చెందిన నీరో అనే ఫిన్‌టెక్ స్టార్టప్‌తో హౌసింగ్.కామ్ చేతులు కలిపింది.
అద్దె కట్టే సమయంలో చేతిలో డబ్బు లేకపోతే కస్టమర్లు ఈ రెంట్ నౌ పే లేటర్‌ను వాడుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. హౌసింగ్.కామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకని అద్దెకు కావాల్సిన మొత్తాన్ని పొందవచ్చు. అంతేకాదు ఇలా అద్దె డబ్బు ఇస్తున్నందుకు కంపెనీ కన్వీనియన్స్ ఫీజ్ కూడా తీసుకోదు. డబ్బు తీసుకున్న 40 రోజుల వరకు ఎలాంటి వడ్డీ కూడా అడగదు. క్రెడిట్ కార్డులు లేనివారికి ఈ రెంట్ నౌ పే లేటర్ ఆప్షన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇంకా అఫీషియల్‌గా స్టార్ట్ అవ్వలేదు కానీ టెస్టింగ్‌లో మాత్రం మంచి ఫలితాలు ఇచ్చిందని కంపెనీ అధికారులు అంటున్నారు. దాదాపు లక్ష మంది ఈ సేవల్ని ఉపయోగించుకుని తమకు ఈ ఫీచర్ చాలా నచ్చిందని చెప్పినట్లు తెలిపారు.