Shark Attack: షార్క్ దాడిలో హాలీవుడ్ న‌టుడు దుర్మ‌ర‌ణం

hollywood actor died in Shark Attack

Shark Attack: షార్క్ దాడిలో ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు త‌మాయో పెర్రీ దుర్మ‌ర‌ణం చెందారు. పైరేట్స్ ఆఫ్ ది క‌రీబియ‌న్ సినిమాలో న‌టించిన పెర్రీ.. నిజ జీవితంలో స‌ర్ఫింగ్ నిపుణుడిగా, లైఫ్‌గార్డ్‌గా ప‌నిచేస్తున్నారు. హ‌వాయిలోని గోట్ ద్వీపానికి వెళ్లిన పెర్రీ.. అక్క‌డ స‌ర్ఫింగ్ చేస్తుండ‌గా ఓ షార్క్ అత‌నిపై దాడి చేసింది. అది గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారు జెట్ స్కీయింగ్ ద్వారా పెర్రీని తీరానికి తీసుకొచ్చారు. అప్ప‌టికే షార్క్ నోటికి చిక్కిన పెర్రీ చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు.