USA: హిందూ ఆలయం ధ్వంసం.. గోడలపై తప్పుడు రాతలు
USA: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్వామినారాయణ ఆలయం గోడలపై తప్పుడు రాతలు రాసి ఉండటం కలకలం రేపింది. ఖలిస్తానీకి మద్దతుగా ఆ గీతలు, రాతలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురించి వ్యతిరేకంగా ఆలయ గోడలపై రాసారు. దీనిపై భారత్ తీవ్రంగా ఖండించింది. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాలిఫోర్నియాలోని నెవార్క్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.