అత్య‌ధిక లోన్లు ఏపీలోనే..!

highest number of loans are being taken in andhra pradesh

Andhra Pradesh: దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక లోన్లు తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉంది. 2022 నుంచి 2023 వ‌ర‌కు కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే ప్ర‌తి ల‌క్ష మందిలో 60,092 మంది లోన్లు తీసుకున్నారు. రెండో స్థానంలో తెలంగాణ ఉంది. 2022 నుంచి 2023 మ‌ధ్య‌లో తెలంగాణ‌కు చెందిన ప్ర‌తి ల‌క్ష మందిలో 42,407 మంది లోన్లు తీసుకున్నారు. మూడో స్థానంలో 35,703 మందితో త‌మిళ‌నాడు ఉంది. ఇక తెలంగాణ‌లో మ‌హిళ‌ల కంటే పురుషులే ఎక్కువ లోన్లు తీసుకున్నార‌ట‌. ఆంధ్రప్ర‌దేశ్‌లోనూ ఇదే ప‌రిస్థితి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్పులు తీర్చాల్సిన మ‌గ‌వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 18 సంవ‌త్స‌రాలు నిండిన 98% మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. తెలంగాణ‌లో 97.5 శాతం మంది ఖాతాలు ఉన్నాయి.

2023 నుంచి 2024 మ‌ధ్య‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన జ‌నాభాలో త‌ల‌స‌రి అప్పు రూ.1,44,336 వ‌ర‌కు ఉంది. త‌ల‌స‌రి ఆదాయం మాత్రం రూ.2,70,295 ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదాయం అభివృద్ధి 9.06 శాతానికి ప‌డిపోయింది. అంత‌కుముందు ఉన్న తెలుగు దేశం పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆదాయం 13.21 శాతం వ‌ర‌కు ఉంది. ఇక చ‌దువు విష‌యానికొస్తే.. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌లో సైన్స్, టెక్నాల‌జీ రంగాల్లో చ‌దువుతున్న విద్యార్థుల శాతం 62.3. ఇది ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే ఎక్కువ‌. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 58.5 శాతంగా ఉంది.