High Court: విడాకుల కోసం కోర్టుకు వృద్ధులు.. జడ్జి కామెంట్ సూపర్
High Court: ఈ మధ్యకాలంలో నిన్న పెళ్లి చేసుకుని ఈరోజు విడాకులు కావాలనే జంటలే ఎక్కువైపోయాయి. దాంతో ఫ్యామిలీ కోర్టులకే ఎక్కువ పని ఉంటోంది. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల వయసులో ఓ వృద్ధ జంట విడాకులు కావాలంటూ కోర్టుకెక్కడం వైరల్‌గా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మునేష్ కుమార్ గుప్తా అనే 80 ఏళ్ల వృద్ధుడికి 76 ఏళ్ల తన భార్యతో ఓ ప్రాపర్టీ విషయంలో 2018 నుంచి వివాదం నెలకొంది. ఈ విషయం కాస్తా పోలీసుల దాకా వెళ్లడంతో వారు ఆ వృద్ధ దంపతులను ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపించారు. అక్కడ గొడవ ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పెద్దవాడి తన భర్త పెన్షన్ నుంచి తనకు రూ.15000 నెల నెలా భరణం కావాలని స్థానిక ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. మునేష్ కుమార్ రిటైర్డ్ హెల్త్ సూపర్‌వైజర్. ఆయనకు నెలకు వచ్చే పెన్షన్ రూ.30,000. అందులో సగం చచ్చినా ఇవ్వను అని కోర్టులో తన వాదనను జడ్జికి వినిపించగా.. కనీసం రూ.5000 వరకు అయినా ఇవ్వాలని తీర్పు ఇచ్చారు.
ఇది కూడా పెద్దాయన మునేష్‌కు నచ్చలేదు. తన పెన్షన్ నుంచి రూపాయి కూడా ఇవ్వను అంటూ అలహాబాద్ హైకోర్టులో కేసు వేసాడు. హైకోర్టు జడ్జి సౌరభ్.. ఆ వృద్ధ దంపతుల కేసు గురించి తెలుసుకుని ఒక కామెంట్ చేసారు. బాబోయ్.. కలియుగం వచ్చేసింది. ఇలాంటి విడాకులు, గొడవలు సమాజానికి చాలా చేటు అన్నారు. ఏదేమైనా కేసు తన పరిధిలోకి వచ్చింది కాబట్టి తదుపరి వాదన సమయానికి ఏదో ఒకటి తేల్చుకుని రండి అని చెప్పి పంపించారు.