Abortion: బాలిక అబార్ష‌న్‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌ని హైకోర్ట్

Hyderabad: ఓ బాలిక అబార్ష‌న్ (abortion) చేయించుకోవ‌డానికి హైకోర్ట్ (high court) ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. ఇందుకు కార‌ణం ఆమె ఇష్ట‌పూర్వ‌కంగానే మ‌రో వ్య‌క్తితో క‌లిసిందట‌. అందుక‌ని అబార్ష‌న్ చేయించ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పేసింది.

వివ‌రాల్లోకెళితే.. ముంబైకి చెందిన ఓ బాలిక 2022 నుంచి ఓ కుర్రాడితో రిలేష‌న్‌షిప్‌లో ఉంది. ఈ క్ర‌మంలో బాలిక గ‌ర్భ‌వతి అయింది. అయితే మైన‌ర్ బాలిక‌ల‌కు కొన్ని చ‌ట్టాల కింద అబార్ష‌న్ చేయించుకునే అవ‌కాశాన్ని కోర్టు ఇచ్చింది. ఒక‌వేళ మైన‌ర్ రేప్‌కి గురై గ‌ర్భం దాలిస్తే అబార్ష‌న్ చేయించుకోవ‌చ్చు. కానీ ఈ కేసులో అలా కాదు. బాలిక ఇష్ట‌పూర్వ‌కంగానే ప్రేమించిన కుర్రాడితో క‌లిసింది. అయితే జులై 29న ఆ బాలిక మేజ‌ర్ అయింది. ఈ నేప‌థ్యంలో బాలిక త‌ల్లి త‌న కూతురికి పోక్సో చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని చెప్పి బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేప‌థ్యంలో అబార్ష‌న్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది.

ఈ పిటిష‌న్‌ను అన్ని విధాలుగా ప‌రిశీలించాక ఈ రోజు బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాలిక అమాయ‌కురాలు ఏమీ కాద‌ని, త‌న‌కు తెలీకుండా ఈ త‌ప్పు జ‌ర‌గ‌లేద‌ని కోర్టు తెలిపింది. అన్నీ తెలిసే ఇష్ట‌పూర్వ‌కంగానే గ‌ర్భం దాల్చింద‌ని పేర్కొంది. కాబ‌ట్టి అబార్ష‌న్‌కి ఒప్పుకునే ప‌రిస్థితి లేద‌ని, కావాలంటే బిడ్డ పుట్టాక అనాథాశ్ర‌మంలో చేర్పించే హ‌క్కు బాలిక‌కు ఉంద‌ని తీర్పు చెప్పింది. (abortion)