Hardik Pandya: హార్దిక్, కృణాల్ పాండ్య‌ల స‌వ‌తి సోద‌రుడు అరెస్ట్

Hardik Pandya: ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్లు హార్దిక పాండ్య‌, కృణాల్ పాండ్య‌ల గురించి తెలీని వారు లేరు. అయితే వీరిద్ద‌రికీ ఓ స‌వ‌తి త‌మ్ముడు కూడా ఉన్నాడు. అత‌ని పేరు వైభ‌వ్ పాండ్య‌. ప్ర‌స్తుతం ఇత‌ను చీటింగ్ కేసులో పోలీసుల చెర‌లో ఉన్నాడు. 2021లో హార్దిక్, కృణాల్ క‌లిసి పాలిమ‌ర్ వ్యాపారం మొద‌లుపెట్టారు. ఇందులో వీరిద్ద‌రూ 40 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌గా.. వైభ‌వ్ తాను కూడా చేర‌తాన‌ని చెప్పి 20 శాతం పెట్టుబ‌డి పెట్టారు. హార్దిక్, కృణాల్ క్రికెట్ మ్యాచ్‌ల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో వైభ‌వ్ వారిద్ద‌రికీ తెలీకుండా ఫోర్జ‌రీలు చేసి రూ.4 కోట్లు న‌ష్టం క‌లిగేలా చేసాడు. దాంతో వారిద్ద‌రూ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా.. పోలీసులు వైభ‌వ్‌ను అరెస్ట్ చేసారు.