Harbhajan Singh: డాక్టర్ దగ్గర చూపించుకో పో.. పాక్ మాజీ కెప్టెన్‌పై భజ్జీ ఫైర్
Harbhajan Singh: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇన్జమామ్ ఉల్ హక్‌పై మండిపడ్డారు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. గతంలో హర్భజన్ ఇస్లాం మతంలోకి మారాలనుకున్నాడని ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో మౌలానా తారీఖ్ జమీల్ విని హర్భజన్ దాదాపు ముస్లిం మతంలోకి రావాలనుకున్నాడని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై హర్భజన్ స్పందిస్తూ.. ఇన్జమామ్‌కి మెంటల్ ఎక్కినట్లుందని ఆయన డాక్టర్ దగ్గర చూపించుకుంటే మంచిదని మండిపడ్డారు. సిక్కు కుటుంబంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని హర్భజన్ తెలిపారు. ఇన్జమామ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాకిస్థాన్ బోర్డు నుంచి ఆయన్ను తొలగించారు.