Hamas: ఆ అమ్మాయి వీడియోను ఇప్పుడెందుకు బయటపెట్టింది?
Hamas releases a woman’s video: హమాస్ సంస్థ (hamas) ఈరోజు తమ బందీలో ఉన్న ఒక యువతి వీడియోను బయటపెట్టింది. ఆ అమ్మాయి పేరు మియా. ఫ్రాన్స్‌కి చెందిన ఆ యువతి మొన్న ఇజ్రాయెల్‌లో (israel) జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లింది. అదే సమయంలో హమాస్ దాడులకు పాల్పడింది. అనంతరం ఆ మ్యూజిక్ ఫెస్టివల్‌కి వచ్చిన వారిలో దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకుంది.
ఇప్పుడు హమాస్ చెరలో ఉన్న బందీల్లో పై ఫోటోలో ఉన్న మియా కూడా ఉంది. అయితే.. రెండు వారాల క్రితం వారిని బందీలుగా చేసుకున్న హమాస్.. యువతికి సంబంధించిన వీడియోని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసింది అనే దానిపై సందేహాలు వెల్లువవుతున్నాయి. బహుశా ప్రస్తుతం బందీలు ఉన్న ప్రదేశం ఇజ్రాయెల్ ఆర్మీ కనిపెట్టకుండా ఉండేందుకు హమాస్ ఆడుతున్న ఆట అని కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ రిలీజ్ చేస్తున్న ఒక్కో వీడియోను టెక్నాలజీని ఉపయోగించి డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ బందీలను ఎక్కడ దాచిందో తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. (hamas)