Hamas: దాడులు ఆపితే.. బందీలను వదిలేస్తాం
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి (israel) గాజాకు (gaza) చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ (hamas) బంపర్ ఆఫర్ ఇచ్చింది. గాజాపై ఎలాంటి దాడులు చేయకపోతే తమ బందీలుగా ఉన్న ప్రజలను వెంటనే వదిలేస్తామని హమాస్ ప్రకటించింది. హమాస్ చెప్పినట్లుగా ఇజ్రాయెల్ గాజాపై ఎలాంటి దాడులు చేయకపోతే గంటలోనే అందరినీ వదిలేస్తామని హమాస్ కమాండర్‌లు వెల్లడించారు.
కొందరు హమాస్ వద్ద బందీలుగా ఉంటే.. మరికొందరు పాలెస్తీనాకు చెందిన మరో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ జిహాద్ వద్ద బందీలుగా ఉన్నారు. ఇస్లామిక్ జిహాద్ వద్ద బందీలుగా ఉన్నవారిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. కానీ ఇజ్రాయెల్‌పై గాజా దాడులకు పాల్పడుతుండడంతో హమాస్ ఏమీ చేయలేకపోతోంది. (hamas)