Hair Straightening చేయించుకోవడంతో కిడ్నీ ఫెయిల్..!
Hair Straightening: ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలా మంది హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటున్నారు. జుట్టుకు ఘాటైన కెమికల్స్ వాడి హెయిర్ స్ట్రెయిట్ చేస్తే దాదాపు మూడు నుంచి ఆరు నెలల పాటు జుట్టు అలాగే స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఈ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకున్న ఓ యువతికి కిడ్నీ ఫెయిల్ అవడం వైరల్‌గా మారింది.
2020, 2021, 2022 సంవత్సరాలలో 21 ఏళ్ల యువతి హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంది. జుట్టును స్ట్రెయిట్ చేస్తుంటే మాడుకు తగిలి స్వల్పంగా కాలింది. అయితే ఆమె హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకున్న ప్రతిసారీ వాంతులు, విరోచనాలు, నీరసంగా అనిపించేది. 2022 తర్వాత ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఆమె వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు మహిళకు అప్లై చేసిన హెయిర్ క్రీంలో గ్లయోక్జైలిక్ యాసిడ్ వాడినట్లు తేలింది. ఈ యాసిడ్ తలకు పట్టించడంతో మాడులోని రంధ్రాల నుంచి రక్తం ద్వారా కిడ్నీలకు చేరింది. దాంతో ఆ యువతికి క్రియాటినైన్ లెవెల్స్ దారుణంగా పెరిగిపోయి కిడ్నీలు పాడైపోయాయి.
దాంతో సెలూన్లలో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసే ప్రక్రియలో ఈ గ్లయోక్జైలిక్ యాసిడ్‌ను వాడకుండా దానిని పూర్తిగా బ్యాన్ చేయాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ యువతి పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకోవాలనుకునేవారు ఒకటికి రెండు సార్లు వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.