Goa: విమానంలో పరిచ‌యం.. ల్యాండయ్యాక రేప్

విమానంలో ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసుకుని ల్యాండ‌య్యాక ఆమెను దారుణంగా రేప్ చేసాడు ఓ నీచుడు. ఈ ఘ‌ట‌న గోవాలో (goa) చోటుచేసుకుంది. గుజ‌రాత్‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ షియార్ అనే 45 ఏళ్ల వ్య‌క్తి ఈ నెల 23న గోవా ఫ్లైట్ ఎక్కాడు. అదే విమానంలో ప్ర‌యాణిస్తున్న ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఆమె నుంచి తెలివిగా నెంబ‌ర్ కూడా తీసుకున్నాడు. గోవాలో ల్యాండ్ అయ్యాక‌.. ఆ యువ‌తిని ఫోన్ చేసి స‌ర‌దాగా క‌లుద్దామ‌ని చెప్పాడు. అలా త‌ను బుక్ చేసుకున్న రిసార్ట్‌కు ఆమెను పిలిచాడు. ఆ యువ‌తి రిసార్ట్‌కి వెళ్ల‌గానే రూంలో బందించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. పైగా ఈ విష‌యాన్ని ఎవ‌రికైనా చెప్తే చంపేస్తాన‌ని బెదిరించాడు. అయినా ఆ అమ్మాయి బెద‌ర‌లేదు. వెంట‌నే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వెంట‌నే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. (goa)