Heart Attack: గుండెపోటుతో చనిపోయిన ప్రముఖ కార్డియాలజిస్ట్!
Gujarat: భారత్‌లోనే ప్రముఖ కార్డియాలజిస్ట్‌లలో ఒకరైన గౌరవ్ గాంధీ (gaurav gandhi) (41) గుండెపోటుతో (heart attack) చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌కు (gujarat) చెందిన గౌరవ్ గాంధీ.. జామ్‌నగర్‌లోని బరోడా హార్ట్ ఇన్స్టిట్యూట్లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తుండేవారు. సోమవారం పేషెంట్లను చూసి వచ్చిన గౌరవ్.. మంగళవారం ఉదయం తన గదిలో స్పృహకోల్పోయి కనిపించారు. కుటుంబీకులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన గుండెపోటుతోనే చనిపోయారని చెప్పారు. గౌరవ్ తన కెరీర్లో ఇప్పటివరకు 16000 మందికి సర్జరీలు చేసారు. జామ్‌నగర్‌లో బేసిక్ మెడికల్ డిగ్రీ చేసిన గౌరవ్.. అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేసారు. ఆ తర్వాత మళ్లీ జామ్ నగర్లోనే ప్రాక్టీసింగ్ మొదలుపెట్టారు. హాల్ట్ హార్ట్ ఎటాక్స్ అనే ఫేస్బుక్ క్యాంపెయిన్‌లో గౌరవ్ కూడా ఓ సభ్యుడిగా ఉండేవారు. ఎందరో పేషంట్లకు ట్రీట్మెంట్ చేసిన గౌరవ్ చివరికి గుండెపోటుతోనే చనిపోవడం బాధాకరం.