Marriage: సిగరెట్ తాగిన అత్తగారు.. ఆగిన పెళ్లి
Uttar Pradesh: పెళ్లి మండపంలో (marriage) కాబోయే అత్తగారు సిగరెట్లు తాగుతూ.. కాబోయే భార్య వచ్చిన అతిథులకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తుండడంతో షాకయ్యాడు వరుడు. ఇలాంటి ఇంటికి అల్లుడిగా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. దాంతో పెళ్లి ఆపేసాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి నిన్న రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లికి వస్తున్న అతిథులకు వధువు గాల్లో ముద్దులు ఇస్తూ.. అత్తగారు సిగరెట్ తాగుతూ ముఖంపైనే పొగ వదులుతుండడం వరుడు చూసాడు. ఇలాంటి ఇంటికి నేను అల్లుడిగా రావాలా? అంటూ నానా రచ్చ చేసాడు. అయినా కూడా వధువు కానీ ఆమె తల్లిదండ్రులు కానీ సారీ చెప్పి నచ్చజెప్పడానికి ప్రయత్నించలేదు. దాంతో పెళ్లి పెటాకులైంది.