Great Love Story: ప్రియుడి కోసం వేల కోట్లు వ‌దిలేసి..

Hyderabad: ఇలాంటి క‌థ‌లు విన్న‌ప్పుడే ఈరోజుల్లోనూ నిజ‌మైన ప్రేమ ఇంకా బ‌తికే ఉంది అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. డ‌బ్బుంటేనే ప్రేమించేవారు ఎక్కువ అయిపోతున్న ఈ రోజుల్లో ఓ యువ‌తి మ‌నసిచ్చిన వాడి కోసం కొన్ని వేల కోట్ల ఆస్తిని వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డింది. వీరిద్ద‌రి క‌థేంటో తెలుసుకుందాం. (great love story) మ‌లేషియాకు (malaysia) చెందిన ఏంజిలీన్ డ‌బ్బున్న కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి మ‌లేషియ‌న్ బిజినెస్ టైకూన్ ఖోకే పెంగ్. ఆమె త‌ల్లి మిస్ మ‌లేషియ‌న్. ఏంజిలీన్ దాదాపు రూ.2000 కోట్ల‌కు వార‌సురాలు. ఏంజిలీన్ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్న‌ప్పుడు ఆమెకు ఫ్రాన్సిస్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఇద్ద‌రి మ‌ధ్య చిగురించిన స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింది. అయితే ఫ్రాన్సిస్ అంత డ‌బ్బున్న‌వాడు కాదు. దాంతో వీరి పెళ్లి ఏంజిలీనా త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. (great love story)

దాంతో వేల కోట్లు వ‌ద్ద‌నుకుని 2008లో ఇంట్లో నుంచి వ‌చ్చేసింది ఏంజిలీన్. త‌ను ప్రేమించిన ఫ్రాన్సిస్‌నే పెళ్లి చేసుకుంది. అలా ఇద్ద‌రూ వారి త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఏంజిలీన్ జీవితంలో మ‌రో బాధాక‌ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏంజిలీన్ పెళ్లి జ‌రిగిన మూడేళ్ల‌కు ఆమె త‌ల్లిదండ్రులు విడిపోయారు. దాంతో ఆమె కోర్టులో హాజ‌రు కావాల్సి వ‌చ్చింది. అప్పుడు ఏంజిలీన్ తన త‌ల్లికే స‌పోర్ట్ చేసింది. త‌న తండ్రి 24 గంట‌లూ డ‌బ్బు ఎలా సంపాదించాలి అన్న ఆలోచ‌న‌లోనే ఉండేవాడ‌ని, కుటుంబాన్ని జాగ్ర‌త్త‌గా త‌న త‌ల్లే ద‌గ్గ‌రుండి చూసుకుంద‌ని కోర్టులో తెలిపింది. (great love story)

Angeline Francis
Angeline Francis