Viral News: వారు ఉద్యోగం తీసేస్తే.. గూగుల్ డ‌బుల్ సాల‌రీతో బంప‌ర్ ఆఫ‌ర్!

Viral News: ఇటీవలి కాలంలో లేఆఫ్స్ (Lay Off) ఎక్కువైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నెల వ్యవధిలోనే 30 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక యువతి మాత్రం లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగం కోల్పోగా.. గూగుల్‌లో రెట్టింపు జీతంతో మంచి పొజిషన్‌కు చేరుకోవడం గమనార్హం. ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి. (Viral News)

కొంతకాలంగా ఉద్యోగాలకు గ్యారంటీనే ఉండట్లేదు. ఈ క్రమంలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్స్ అస్త్రాన్ని ఎంచుకుంటున్నాయి. తమకు భారంగా అనిపించిన.. అవసరం లేదనుకున్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్ని కారణంగా చూపుతున్నాయి. 2023 సంవత్సరం ఆరంభంలో మెటా (Meta), గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించగా.. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ అది కొనసాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటివి లేఆఫ్స్ చేశాయి.

ఐర్లాండ్‌కు చెందిన ‘మరియానా కొబయాషి’కి లింక్డిన్‌లో (Linkedin) పని చేయడం ఓ కల. పలు దిగ్గజ కంపెనీల్లో ఎన్నో తిరస్కరణల తర్వాత చివరికి 2022లో ఉద్యోగం సాధించింది. కానీ గతేడాది ఆర్ధిక మాంద్యం భయాలు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాయి. ఈ తొలగింపుల్లో 2023 మేలో కోబయాషిని తొలగిస్తూ లింక్డిన్‌ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం పోవడంతో ఇతర కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆమె తయారు చేసుకున్న ఒక క్రియేటివ్ జాబ్ అప్లికేషన్ (వీడియో రెజ్యుమే) (Resume) ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాక.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే గూగుల్‌కు (Google) ఎంపికైంది. దాదాపు రెట్టింపు జీతంతో, ఉన్నత స్థాయిలో జాబ్‌ ఆఫర్‌ చేయడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్‌ గురైన సందర్భంలో ఆమె మానసిక సంఘర్షణ ఎలా ఉందో చెబుతూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకుంది.

లింక్డిన్‌లో లేఆప్స్‌ సమయంలో తనకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకుంటూ.. నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లేఆఫ్స్ నన్ను షాక్‌కి గురి చేశాయి. లింక్డిన్‌లో ఉద్యోగం సాధించడం ఓ కలగా భావించనందునే .. అందులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఊహాలోకంలో విహరించాను. అదెంత తప్పో ఆ తర్వాతే తెలిసింది. లేఆఫ్స్‌కు గురయ్యాను. నాకున్న వ్యాల్యుని ఉద్యోగంతో ముడిపెట్టకూడదని, లేదంటే ఎప్పుడూ సంస్థల్ని నమ్ముకుని ఉండొద్దనే అనుభవం నాకు నేర్పించింది. తొలగింపుల నుంచి బయటపడేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాను. చివరికి గూగుల్‌ డబ్లిన్ కార్యాలయంలో అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని పొందినట్లు తెలిపింది.

ఇప్పుడు నన్ను నేను చూసుకుని గర్వపడుతున్నాను. లింక్డిన్‌లో లేఆఫ్స్‌ గురైన తర్వాత నా కెరీర్‌లో రెండు అత్యున్న స్థానాలకు చేరుకున్నాను. ఒకటి జీతం డబుల్‌ అయ్యింది. రెండోది నాకు సరిపోయే గూగుల్‌లో ఉద్యోగం పొందడం. అదే లింక్డిన్‌లో ఉంటే ఆ రెండు అసాధ్యం’ అని వెల్లడించింది. ఈ సందర్భంగా లేఆఫ్స్‌ గురైన వారికి కోబయాషి పలు సూచనలు చేశారు. ఉద్యోగం పోగొట్టుకున్న వారికి నేనిచ్చే సలహా ఒకటే ప్రతి సంక్షోభంలోనూ ఓ అవకాశాన్ని వెతుక్కోడింది. అదే మిమ్మల్ని అత్యున్న స్థాయిలో ఉంచేలా చేస్తోంది అని ముగించింది.

మైక్రోసాఫ్ట్ (Microsoft) యాజమాన్యంలోని లింక్డిన్‌ గత ఏడాది రెండు సార్లు ఉద్యోగుల్ని తొలగించింది. రెండవ సారి ఇంజనీరింగ్, టాలెంట్ అండ్‌ ఫైనాన్స్ విభాగాలలో దాదాపూ 700 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇచ్చింది. వారిలో మరియానా కొబయాషి ఒకరు.