Elon Musk తో గూగుల్ కో ఫౌండర్ భార్య ఎఫైర్..!
టెస్లా (tesla) అధినేత ఎలాన్ మస్క్‌తో..(elon musk) గూగుల్ (google) సహ వ్యవస్థాపకుడు సెర్జే బ్రిన్ (sergey brin) భార్య నికోల్ షెనాహన్ (nicole shenahan) ఎఫైర్ పెట్టుకుందట. ఈ విషయం సెర్జేకి తెలీడంతో ఆయన నికోల్ నుంచి విడాకులు కోరుతున్నాడు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం నికోల్, సెర్జేల విడాకులు మే 26న కన్ఫామ్ అయ్యాయి. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. కూతురి బాధ్యతను ఇద్దరూ షేర్ చేసుకోనున్నారు. 2015లో నికోల్, సర్జే డేటింగ్‌లో ఉన్నారు. అదే సంవత్సరంలో సర్జే తన మొదటి భార్య ఆన్నేకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2018లో సర్జే నికోల్‌ను వివాహం చేసుకున్నాడు. 2021లో నికోల్, సర్జే విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారు. 2022 జనవరిలో సర్జే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.
నికోల్, ఎలాన్ మస్క్ (elon musk) ఎప్పటినుంచో స్నేహితులు. వీరిద్దరికీ ఎఫైర్ ఉందని తెలీడంతో సర్జే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడట. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని.. ఎలాంటి ఎఫైర్ లేదని మస్క్ తెలిపారు. ఓ పార్టీలో నికోల్‌ను కలిసానని.. ఆ పార్టీలో చాలా మంది ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. “” నేను, ఎలాన్ మస్క్ కేవలం ఫ్రెండ్ర్ మాత్రమే. అంతకుమించి మేమేమీ ఊహించుకోలేదు కూడా. మా ఇద్దరి మధ్య ఎలాంటి సెక్స్ కానీ రొమాంటిక్ ఎఫైర్ కానీ లేదు “” అని నికోల్ కూడా మీడియా ముందు తెలిపారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు అయిన సెర్జే బ్రిన్ ప్రపంచంలోనే 9వ రిచెస్ట్ పర్సన్. ఇతని ఆస్తి విలువ 118 బిలియన్ డాలర్లు.