Visa: భారతీయులకు ఆస్ట్రేలియా గుడ్ న్యూస్
Visa: భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియాలో చదువుకోవాలి అనుకునేవాళ్లకు, వర్క్ చేయాలనుకునేవారికి 1000 వీసాలను ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ వెయ్యి వీసాలను అక్టోబర్ 1 నుంచి ఇవ్వనుంది. AI-ECTA అగ్రిమెంట్ ప్రకారం ఈ వీసాలను ఇవ్వాలనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. అంటే.. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఇస్తున్న వీసా అన్నమాట.
ఇంతకీ ఈ వీసాలు ఎవరికి ఇస్తారు?
18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు వారికి 12 నెలల వీసాను ఆస్ట్రేలియా కల్పిస్తుంది. దీని ద్వారా 12 నెలల పాటు ఆస్ట్రేలియాలో ఉండచ్చు. ఈ 12 నెలలు హాలిడే ఎంజాయ్ చేయచ్చు, ఉద్యోగం చేయచ్చు, చదువుకోవచ్చు కూడా. ఇందుకు అయ్యే ఖర్చు 650 ఆస్ట్రేలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.36,748. ఈ 12 నెలల కాలంలో నాలుగు నెలల పాటు చదువుకుని… మళ్లీ ఇండియాకి వెళ్లి మళ్లీ ఎన్నిసార్లైనా ఆస్ట్రేలియాకి వెళ్లే వెసులుబాటు కల్పించింది.
అర్హులెవరు?
దరఖాస్తు దారుడి వయసు 30 లోపు ఉండాలి. పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ ఐడెంటిటీ కార్డు ఉండి తీరాలి.
రూ.1500 దరఖాస్తు రుసుం చెల్లించాలి.
ఈ వీసాలను బ్యాలెట్ సిస్టమ్ ద్వారా జారీ చేస్తారు.
ఈ బ్యాలెట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయితే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన 28 రోజుల్లోగా వర్క్, హాలిడే వీసా అప్లై చేసుకోవాలి. 28 రోజుల తర్వాత ఆ నోటిఫికేషన్ పనిచేయదు.