Prakasam: భార్యకు ఆర్థిక సాయం.. మర్మాంగం కోసేసిన ప్రేయసి
Prakasam: భార్య ఉండగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి తగిన శాస్తే జరిగింది. మరో మహిళతో సహజీవనం చేస్తూ భార్యకు డబ్బులు పంపుతున్నాడని తెలిసి.. ప్రేయసి అతని మర్మాంగం కోసేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన విజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా తొర్రగూడిపాడు గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతను పాల వ్యాపారం చేస్తున్నాడు. భార్య ఉన్నప్పటికీ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నాలుగు నెలలుగా ఆమెతోనే కలిసి ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో తనను పట్టించుకోకుండా డబ్బంతా భార్యకు పంపుతున్నాడని తెలిసింది. దాంతో ఆ మహిళ కోపోద్రిక్తురాలై.. నిన్న రాత్రి విజయ్ నిద్రిస్తుండగా చేతులు కట్టేసి.. కళ్లకు గంతలు కప్పి ఫోన్ లాక్కుంది. ఆ తర్వాత కత్తితో అతని మర్మాంగం కోసేసింది. ఆ తర్వాత ఇంటి యజమానికి జరిగిన విషయం చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోపక్క విజయ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది.