భార‌త్‌కు స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చిన జర్మ‌నీ

germany gave special status for india

India: భార‌త్‌కు జ‌ర్మ‌నీ స్పెష‌ల్ స్టేట‌స్ ప్రక‌టించింది. దీని అర్థం ఏంటంటే.. జర్మన్ కంపెనీల నుండి మిలిట‌రీ ఆయుధాల‌ కొనుగోళ్లకు అనుమతులను వేగవంతం చేయ‌డం. ప్రాజెక్ట్-75I కింద స‌బ్‌మెరైన్ ఒప్పందంపై భార‌త్ కీల‌ నిర్ణయం తీసుకోబోతోంది. ఇది 43,000 కోట్ల రూపాయల (సుమారు 4.8 బిలియన్ డాలర్లు) విలువైన అతిపెద్ద‌ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత నావికాదళానికి ఆరు కొత్త నౌకలు వ‌స్తాయి.  జర్మన్ కంపెనీ అయిన‌ థిసెన్‌క్రూప్ స‌బ్‌మెరైన్ సిస్టమ్స్ (TKMS) స్పెయిన్‌కి చెందిన‌ నావాంటియా ఈ నౌక ఒప్పందానికి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

ఈ నౌక ఒప్పందం ప‌ట్ల‌ జర్మనీ, స్పెయిన్‌కి చెందిన‌ అధికారులు అత్యంత ప్రాధాన్య‌త‌గా తీసుకున్నారు. ఇది జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెస్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ప్రధాన చర్చా అంశం కాబోతోంది. ఈ ప్రక్రియలో ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు జర్మన్ ప్రభుత్వం సాయ‌ప‌డుతోంది. భార‌త్‌కు చెందిన‌ కొనుగోళ్ల అనుమతులను వేగంగా పొందేందుకు ఈ విధానాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో భారత నావికాదళం జర్మనీలో TKMS నౌకాశ్రయంలో నౌకలను పరీక్షించింది. జూన్‌లో నావాంటియాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఇంకా సమీక్షలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా భారతదేశపు అతిపెద్ద సరఫరాదారు కాబట్టి.. భారతదేశం తమ రక్షణ భాగస్వాములను విస్త‌రించాల‌నుకుంటోంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా ప్ర‌భావం ఎక్కువగా ఉన్న నేప‌థ్యంలో ఆ దేశానికి మ‌న దెబ్బ రుచిచూపించేందుకు భార‌త్ నావికాదళాన్ని బలోపేతం చేసుకుంటోంది.