Same Sex Marriage: సుప్రీంకోర్ట్ తీర్పుకు నిరసనగా..
స్వలింగ వివాహాలపై (same sex marriage) సుప్రీంకోర్టు (supreme court) తీర్పు ఇవ్వకపోవడంపై కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం తమకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పుకి నిరసనగా ఒక స్వలింగ సంపర్క జంట (ఇద్దరు మగాళ్లు) ఇలా కోర్టు ప్రాంగణం ముందు రింగులు మార్చుకుంటూ ఫోటోలు దిగారు.
ఇంతకీ సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది?
స్వలింగ జంటల పెళ్లిళ్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు స్వలింగ జంటలు పిటిషన్లు సమర్పించారు. ఈ పిటిషన్లపై దాదాపు పది రోజుల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్ట్ మే నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌తో పాటు మరో నలుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రిజర్వ్ చేసిన తీర్పును వెల్లడించింది. తీర్పులో భాగంగా స్వలింగ జంటల పట్ల వివక్ష చూపకూడదని.. పెళ్లి చేసుకోనంత మాత్రాన వారి ప్రేమ నిజం కాకుండాపోదని అన్నారు. పెళ్లి చేసుకోనివారు.. స్వలింగ జంటలు కూడా పిల్లల్ని దత్తత తీసుకోవచ్చని తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ..
పెళ్లిళ్ల విషయంలో సుప్రీంకోర్ట్ తెలివిగా వ్యవహరించింది. మన దేశంలో మొత్తం మూడు వివాహ చట్టాలు ఉన్నాయి. ఒకటి హిందూ సంప్రదాయం, మరొకటి ముస్లిం, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ మూడు సంప్రదాయాల్లో ఒక స్త్రీ, మగాడికి జరిగే పెళ్లి మాత్రమే వర్తిస్తుంది. ఈ వివాహ వ్యవస్థను పార్లమెంట్ తీర్మానించింది. దాంతో స్వలింగ వివాహాలపై కూడా పార్లమెంట్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దాంతో ఈ మాత్రం దానికి మీరెందుకు ఉన్నట్లు అని స్వలింగ జంటలు వివిధ పార్టీ నేతలు సర్వోన్నత న్యాయస్థానంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. (same sex marriage)