Gautam Adani: మరో బ్యాడ్ న్యూస్.. వేల కోట్లు ఆవిరి
Gautam Adani: ఇండియన్ బిలియనేర్ గౌతమ్ అదానీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. దాదాపు రెండేళ్ల పాటు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ చేసిన ఆరోపణల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అదానీకి ఇప్పుడు వేరే దేశంలో సమస్య వచ్చి పడింది. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ తమ వ్యాపారాన్ని విస్తరించాలని అదానీ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెన్యా, శ్రీలంకలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు.
కెన్యాలో (kenya) అతిపెద్ద విమానాశ్రయం అయిన జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంతో అదానీ కంట్రాక్ట్ పుచ్చుకుంది. ఇది ఏవియేషన్ వర్కర్లకు ఏమాత్రం నచ్చలేదు. అదానీ భారతీయుడని.. అలాంటి వ్యక్తికి ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ఆందోళన చేపట్టారు. దాంతో వేలాది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కి రాలేని విమానం ఎక్కలేని పరిస్థితి ఏర్పడింది.
Gautam Adani: ఈ జోమో కెన్యాట్టా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ని (Jomo Kenyatta International airport) అదానీ సంస్థ 30 ఏళ్ల పాటు లీజ్‌కి తీసుకుంది. ఈ కాంట్రాక్ట్ తమకు ఏమాత్రం నచ్చలేదని.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఏవియేషన్ వర్కర్లు హెచ్చరించారు. దీనిపై ఎయిర్‌పోర్ట్ అధికారులు కెన్యా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వర్కర్ల అనుమతి లేనిదే ఈ డీల్‌ను ముందుకు తీసుకెళ్లమని వారు హామీ ఇచ్చారు.
అసలు అదానీతో డీలే వద్దు అంటుంటే మళ్లీ అనుమతి అంటారేంటి అంటూ ఏవియేషన్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఎయిర్‌పోర్ట్ ఉన్న సామర్ధ్యం కంటే ఎక్కువగా ఆపరేషన్స్ చేపడుతోందని.. దీనిని మెయింటైన్ చేయడం కేవలం ప్రభుత్వం వల్ల కాదని అదానీకి లీజ్‌కి ఇచ్చారు. కెన్యాలో జాతీయ హోదా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ఏవియేషన్ వర్కర్లకు నచ్చలేదు. దీనిపై వారు స్థానిక హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి ప్రతీ అంశం పరిశీలించిన అనంతరం అదానీ ఈ డీల్‌కి దూరంగా ఉంటే మంచిదని తీర్పు ఇచ్చింది.
ఈ ఎయిర్‌పోర్ట్ లీజ్ కోసం అదానీ 1.85 బిలియన్ డాలర్లను వెచ్చించింది. హైకోర్టు తీర్పుతో అదానీకి చుక్కెదురైంది. సరే అని శ్రీలంకలో (srilanka) పెట్టుబడులు పెడదామని అదానీ ప్లాన్ వేసుకున్నారు. శ్రీలంకలో అదానీకి విండ్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. రాబోయే శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో JVP అనే మార్క్‌సిస్ట్ పార్టీ (marxist party) గెలిస్తే ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తామని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ విలువ 440 మిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్ట్ వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తాయని అది మంచిది కాదని ఇప్పటికే ఎన్నో పిటిషన్లు కూడా వేసారు. ఇలా అంతర్జాతీయంగా అదానీకి ఏదీ కలిసి రావడం లేదు. కానీ భారతదేశంలో మాత్రం అదానీని కొట్టేవాడు లేడని మరోసారి రుజువైంది. ఆయన ఏ కాంట్రాక్ట్ పొందాలనుకుంటున్నా అవి వెంటనే ఓకే అయిపోతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర పవర్ సప్లై కాంట్రాక్ట్ అదానీకే దక్కింది. దీని వల్ల అదానీ స్టాక్ ధరలు ఆకాశాన్నంటాయి.