గ్యాంగ్‌స్ట‌ర్ అత్యుత్సాహం.. జైల్ నుంచి రిలీజ్ అయిన రోజే మ‌ళ్లీ జైలుకి!

gangster sent back to jail on the day of his release

Viral News: జైలు నుంచి రిలీజ్ అయిన గ్యాంగ్‌స్ట‌ర్.. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో రిలీజ్ అయిన రోజే మ‌ళ్లీ జైలుకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. నాసిక్ ప్రాంతానికి చెందిన హ‌ర్షద్ అనే వ్య‌క్తి లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా చ‌లామ‌ణి అవుతున్నాడు. ఎంపీడీఏ యాక్ట్ కింద కొన్ని నెల‌ల క్రితం ఇత‌న్ని పోలీసులు అరెస్ట్ చేసారు. రెండు రోజుల క్రితం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అత‌ను రిలీజ్ అయ్యాడు క‌దా అని హ‌ర్ష‌ద్ మ‌ద్ద‌తుదారులు ఫ్యాన్స్ భారీగా ర్యాలీ ఏర్పాటుచేసి మ‌రీ ఇంటికి తీసుకెళ్లాల‌నుకున్నారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విష‌యం పోలీసుల‌కు తెలీడంతో అనుమ‌తి లేకుండా ట్రాఫిక్ ఆగిపోయేలా ర్యాలీ చేసినందుకుగానూ రిలీజ్ అయిన రోజే హ‌ర్ష‌ద్‌ను మ‌ళ్లీ పోలీసులు అరెస్ట్ చేసి లోప‌లేసారు