Gaganyaan: లాంచ్ ఎందుకు ఆగిపోయింది..?

Gaganyaan Mission Aborted: ఇస్రో (isro) ఈరోజు తొలి హ్యూమ‌న్ స్పేస్ మిష‌న్ గ‌గ‌న్‌యాన్‌ను (gaganyaan) టెస్ట్ లాంచ్ చేయాల్సి ఉంది. ఈరోజు ఉద‌యం 8:45 గంట‌ల స‌మ‌యంలో లాంచ్ చేయాల్సి ఉండ‌గా..స‌రిగ్గా 5 సెకెన్ల ముందు మిష‌న్ లాంచ్ ఆగిపోయింది. ఇందుకు కార‌ణం రాకెట్ ఇంజిన్లు స‌మ‌యానికి స్టార్ట్ అవ్వ‌క‌పోవ‌డ‌మేన‌ని ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ (s somnath) వెల్ల‌డించారు.

ఇంజిన్లు స్టార్ట్ అవ్వ‌డంలేద‌ని రాకెట్ లోప‌ల అమ‌ర్చిన కంప్యూట‌ర్ క‌నిపెట్టి వెంట‌నే సిగ్న‌ల్స్ ఇవ్వ‌డంతో లాంచ్‌ను ఆపేసారు. దీనిపై పూర్తి స్థాయిలో విచార‌ణ చేసి మ‌ళ్లీ లాంచ్ ప్లాన్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. స్పేస్ వెహికిల్ అందులో ఉన్న సిబ్బంది క్షేమంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ మిష‌న్ ద్వారా వ్యోమ‌గాముల‌ను అంత‌రిక్షంలోకి పంపాల‌న్న‌ది ఇస్రో ప్లాన్. ఈరోజు లాంచ్ చేయాల్సిన గ‌గ‌న్‌యాన్ స్పేస్ రాకెట్ సేఫ్టీ సిస్ట‌మ్‌ని ప్రొసీజ‌ర్‌ని ప‌రీక్షించాల్సి ఉంది. ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ మార్పుల దృష్ట్యా ప‌లుసార్లు లాంచ్‌ని వాయిదా వేస్తూ వ‌చ్చారు.