Free Bus Scheme: ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. ఈ బాలిక ఏం చేసిందో తెలుసా?
Free Bus Scheme: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. బస్సుల్లో సీట్లు సరిపోవడం లేదు.. మగవారికి బస్సులే దొరకడంలేదు అనే సమస్యల నుంచి ఇప్పుడు పిల్లలు ఉచితమే కదా అని బస్సులు ఎక్కేసి తప్పిపోతున్నారు.
పై ఫోటోలో కనిపిస్తున్న బాలిక ఇదే పని చేసింది. కరీంనగర్‌కు చెందిన ఈ 12 ఏళ్ల బాలిక పెద్దపల్లిలోని బొమ్మక్కల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నుంచి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టగా బాలిక హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌లో కనిపించింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముందు కిడ్నాప్ కేసుగా అనుమానించిన పోలీసులు బాలికను విచారించగా.. తెలీక హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కేసానని మూడు రోజులుగా ఎక్కడికి వెళ్లాలో తెలీక బస్ స్టాప్‌లోనే ఉంటున్నానని తెలిపింది. పాపం తిండి తిప్పలు లేకపోవడంతో బాలిక నీరసించిపోయింది. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను హాస్పిటల్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. అయినా బాలిక బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ ఏం చేస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.