France: 30 వేల ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు పిలుపు!

ఫ్రాన్స్‌లో (france) చ‌దువుకోవాల‌ని అనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోస‌మే. ఇండియాకు (india) చెందిన 30 వేల మంది విద్యార్థుల‌కు (students) ఫ్రాన్స్ అవ‌కాశం కల్పిస్తోంది. ఫ్రాన్స్ నేష‌న‌ల్ డే (france national day) సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్‌ని క‌లిసాక ఈ ప్ర‌క‌ట‌న చేసారు. ఈ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ దౌత్య కార్యాల‌యం అందుకు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేస్తోంది. ఈ ఏర్పాట్ల‌లో భాగంగా విద్యార్థుల‌కు షెంగెన్ వీసాలు ఇచ్చి ఐదేళ్ల పాటు ఫ్రాన్స్‌లో ఉండేలా అనుమ‌తులు ఇవ్వ‌నుంది. (France)

కాక‌పోతే అక్క‌డ చ‌దువుకోవాలంటే కొంతైనా విద్యార్థుల‌కు ఫ్రెంచ్ భాష తెలిసి ఉండాలి. ఇందుకోసం ఫ్రాన్స్ ప్ర‌భుత్వం ఉచితంగా ఇండియ‌న్ విద్యార్థుల‌కు ఫ్రెంచ్ క్లాసెస్ కూడా ఇవ్వ‌నుంది. ఫ్రాన్స్ కూడా ఇండియాలానే భిన్న‌త్వంలో ఏక‌త్వం అనే కాన్సెప్ట్‌తో ఉంటుంద‌ని.. అక్క‌డి సంప్ర‌దాయాల‌ను, వ‌ర‌ల్డ్ క్లాస్ ఎడుకేష‌న్ అవ‌కాశాల‌ను భార‌తీయ విద్యార్థుల‌తో కూడా షేర్ చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ఫ్రాన్స్ దౌత్యాధికారులు తెలిపారు. అక్టోబ‌ర్‌లో ఫ్రెంచ్ దౌత్యాధికారులు చెన్నై, క‌ల‌క‌త్తా, ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లో ఎడుకేష‌న్ మేళా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేళాలో టాప్ 40 ఫ్రాన్స్ ఇన్‌స్టిట్యూట్స్‌కి చెందిన విద్యావేత్త‌లు హాజ‌రుకానున్నారు. వీరంతా క‌లిసి ఫ్రాన్స్‌లో ఎలాంటి కోర్స్ చేస్తే బాగుంటుందో విద్యార్థుల‌కు వారి త‌ల్లిదండ్రుల‌కు గైడెన్స్ ఇస్తారు. (france)