Prajwal Revanna: వర్చువల్‌గా సెక్స్ చేయాలనేవాడు.. ప్రజ్వల్‌పై నాలుగో ఫిర్యాదు
Prajwal Revanna: కర్ణాటక హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నాలుగో కేసు నమోదైంది. సెక్స్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ ప్రస్తుతం కర్ణాటక సిట్ కస్టడీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హసన్‌కి చెందిన ఓ గృహిణి ప్రజ్వల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి స్కూల్ అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తాను ప్రజ్వల్‌ను కలిసానని.. ఆ సమయంలో అతను తన ఫోన్ నెంబర్ తీసుకున్నారని బాధితురాలు పేర్కొంది.
హసన్ వచ్చిన ప్రతీసారి తనకు రాత్రిళ్లు వీడియో కాల్ చేసి వర్చువల్‌గా శృంగారం చేయాలని డిమాండ్ చేసేవాడని.. ఇలా ఒక సంవత్సరం పాటు వేధించాడని పేర్కొంది. అడ్మిషన్ గురించి అడిగిన ప్రతీసారి సెక్స్‌కి ఒప్పుకుంటేనే పని అవుతుందని.. ఇది సాధారణ ప్రక్రియ అని అంటుండేవాడని వెల్లడించింది. ఒప్పుకోకపోతే వీడియో రికార్డింగ్‌ను బయటపెడతానని బెదిరించినట్లు తెలిపింది.
ఓ చెత్త కుప్పలో ప్రజ్వల్ రాసలీలలకు సంబంధించిన దాదాపు 2000 టేపులు దొరికాయి. ఆ టేపుల్లో ఈ మహిళకు సంబంధించిన టేపు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది నాలుగో ఫిర్యాదు కావడంతో ప్రజ్వల్‌పై కేసు మరింత బలపడుతుందని.. ఇంకా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి తమకు సహకరించాలని సిట్ అధికారులు తెలిపారు.