Food Delivery: క‌స్ట‌మ‌ర్‌కి డెలివ‌రీ బాయ్ షాక్!

Hyderabad:  ఫుడ్ ఆర్డ‌ర్ పెట్టుకున్న కస్ట‌మ‌ర్‌కి పాపం ఆ డెలివ‌రీ బాయ్ వ‌ల్ల ఎదురైన అనుభవాన్ని త‌న జీవితంలో మ‌ర్చిపోలేడు (food delivery). ఇంకెప్పుడైనా ఫుడ్ ఆర్డ‌ర్ పెట్టుకోవాల‌న్నా భ‌య‌ప‌డ‌తాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఓ వ్య‌క్తి ఫుడ్ ఆర్డ‌ర్ పెట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఫుడ్ డెలివ‌రీ బాయ్ వ‌చ్చాడు కానీ ఈ పార్సిల్ ఇవ్వ‌కుండా వెళ్లిపోయాడు. పైగా ఆ ఫుడ్ మొత్తం డెలివ‌రీ బాయే తినేసాడు (food delivery). దాంతో క‌స్ట‌మ‌ర్‌కి ఒళ్లుమండిపోయి మెసేజ్ పెట్టాడు. నువ్వు చేసిన ప‌నికి నీ ఉద్యోగం పోతుంది అని మెసేజ్ పెట్టాడు.

ఇందుకు ఆ డెలివ‌రీ బాయ్ క‌నీసం సారీ చెప్పడం లాంటిది కూడా చేయ‌కుండా.. నన్ను ఉద్యోగం నుంచి తీయాలంటే నేను డెలివ‌రీ ఇవ్వ‌లేద‌ని నువ్వు ప్రూవ్ చేయాలి అన్నాడు. ఇందుకు ఆ కస్ట‌మ‌ర్.. నా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో నువ్వు రాలేద‌ని తెలిసిపోతుంది. ఇది మీ కంపెనీకి పంపుతాను అన్నాడు. అయినా కూడా ఆ డెలివ‌రీ బాయ్ బెద‌ర‌లేదు. నువ్వు నీ పిల్ల‌ల క‌డుపు నింప‌డానికి సొంతంగా బ‌య‌టికి వెళ్లి ఫుడ్ తెచ్చుకోకుండా నాలాంటి మ‌రో మ‌గాడిపై ఆధార‌ప‌డినందుకు సిగ్గు ప‌డాలి అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా తిట్టేసాడు. అంత‌టితో అత‌ను ఆగ‌లేదు. ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ తినేసి చాలా టేస్టీగా ఉంది అంటూ క‌స్ట‌మ‌ర్‌ను మ‌రింత రెచ్చ‌గొట్టాడు. ఈ చాట్ మొత్తం ఆ క‌స్ట‌మ‌ర్ రెడిట్‌లో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతోంది. (food delivery)