స్టార్ హీరో రిక్వెస్ట్.. మళ్లీ రాబోతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్
Flipkart: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగింది. వారం రోజుల పాటు ఈ సేల్ జరిగింది. ఈ సేల్ సమయంలోనే అత్యంత తక్కువకే దుస్తులు, మేకప్, ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఫ్రిజ్‌లు ఇలా ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో ఉండేవి. అయితే.. ఈ సేల్ దీపావళికి మళ్లీ రాబోతోంది. సాధారణంగా ఏడాదికి ఒకసారే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతుంది. మళ్లీ ఈ సేల్ రావాలంటే ఏడాది ఆగాల్సిందే. కానీ ఈసారి ఫ్లిప్‌కార్ట్ మరోసారి సేల్ తీసుకురాబోతోంది. ఎందుకో తెలుసా? ఇందుకు కారణం బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.
వరుణ్ ధావన్‌కి తన ఫోన్ మాటి మాటికీ కింద పడేసుకునే అలవాటు ఉందట. ఆ ఫోన్‌కి కేస్ లేకపోవడంతో పలుమార్లు పగుళ్లు వచ్చి వేరే ఫోన్ తీసుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం మరోసారి వరుణ్ ఫోన్ కింద పడి పగిలిపోయిందట. ఈ విషయాన్ని వరుణ్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ .. మళ్లీ నా ఫోన్ కిందపడింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ మళ్లీ వస్తే బాగుండు. ఈసారి తక్కువ ధరల్లో లభించే ఓ మంచి ఫోన్ కేస్ కొనుక్కుంటాను అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ దృష్టికి వెళ్లడంతో మళ్లీ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను తీసుకురావాలని నిర్ణయించారట. వరుణ్ ధావన్ కోసమే కాదు.. దీపావళి వస్తున్న వేళ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరోసారి కావాలంటూ కస్టమర్ల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో మళ్లీ సేల్‌ను తీసుకొస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఓ అధికారి తెలిపారు.