H9N2 Virus: దేశంలో నమోదైన తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నాలుగేళ్ల చిన్నారికి సోకిన వైరస్
H9N2 Virus: దేశంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. H9N2 వైరస్‌గా పరిగణిస్తున్న ఈ వైరస్‌ను వెస్ట్ బెంగాల్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారిలో గుర్తించారు. ఫిబ్రవరి నుంచి విపరీతంగా జ్వరం వస్తుండడం, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
కోలుకోవడంతో వారం రోజుల క్రితమే డిశ్చార్జి చేసారు. అయితే ఇప్పటివరకు చిన్నారిలో కనిపించిన లక్షణాలపై పరిశోధనలు చేయగా అది బర్డ్ ఫ్లూ వైరస్‌గా తేలింది. చిన్నారి నివసిస్తున్న ఇంట్లోనే కోళ్ల ఫారం ఉండటంతో ఎప్పుడూ అక్కడే ఆడుతుండడంతో ఈ వైరస్ సోకిందట. అయితే చిన్నారికి కాకుండా ఇంట్లో వారెవ్వరికీ ఈ వైరస్ సోకలేదు. 2019 తర్వాత భారత్‌లో నమోదైన రెండో బర్డ్ ఫ్లూ కేసు ఇది.