గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

female principal caught drinking beers in gurukul

Suryapet: గురుకుల‌ హాస్టల్‌లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘ‌ట‌న సూర్యాపేట‌లో చోటుచేసుకుంది. బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ‌రాత్రిళ్లు గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది గ‌మ‌నించిన డిగ్రీ విద్యార్థినులు ఇదేంట‌ని అడ‌గ్గా.. వారిని కొట్టేవారు. దాంతో విద్యార్థినుల నిరసన చేప‌ట్ట‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప్రిన్సిపాల్‌ను తొల‌గించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్థానిక అధికారులు తెలిపారు.