ఘోరం..భార్యను బెదిరించి బిడ్డపై అత్యాచారం
Viral News: పుణెలో ఘోరం చోటుచేసుకుంది. ఓ పక్క భార్యను బెదిరిస్తూ మరోపక్క కన్న బిడ్డపై కామవాంఛ తీర్చుకున్నాడు ఓ రాక్షసుడు. స్థానిక కోంధ్వా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక తన తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటన 2023 ఏప్రిల్ నుంచి 2024 మే వరకు జరిగిందని వాంగ్మూలంలో తెలిపింది.
రోజూ తన తండ్రి తాగి ఇంటికి వచ్చేవాడని.. తన తల్లిని కొడుతూ తనపై అత్యాచారానికి పాల్పడేవాడని పేర్కొంది. ఈ విషయం బయట చెప్తే చంపేస్తానని బెదిరించేవాడని తెలిపింది. ఈ నరకాన్ని భరించలేక ఆ బాలిక తన కుటుంబ సభ్యులతో విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోక్సో కేసుతో పాటు నాలుగు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.