మైన‌ర్ కూతుర్ని రేప్ చేసి.. గ‌ర్భ‌వ‌తిని చేసిన కీచ‌క తండ్రి

father impregnates minor daughter

Viral News: క‌న్న తండ్రి కాదు.. కామాంధుడు. క‌ని పెంచిన బిడ్డ‌నే గ‌ర్భ‌వ‌తిని చేసిన నీచుడు. ఈ ఘ‌ట‌న ముంబైలో చోటుచేసుకుంది. మైన‌ర్ బాలిక త‌న తండ్రి, తాత‌గారితో క‌లిసి ఉంటోంది. ఈ నేప‌థ్యంలో కొంత‌కాలంగా క‌డుపు నొప్పిగా ఉంటోంది అన‌డంతో స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ బాలిక గ‌ర్భం దాల్చిన‌ట్లు తెలిసింది. ఏం జ‌రిగింది అని వైద్యులు అడ‌గ్గా.. త‌న తండ్రే త‌న‌పై కొంత‌కాలంగా అత్యాచారం చేస్తున్నాడ‌ని చెప్పింది. దాంతో వైద్యులు షాక‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు సమాచారం అందించారు. కీచ‌క తండ్రిపై పోక్సో యాక్ట్ కింద కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసారు.